బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతివ్యూహానికి సిద్ధమైన చంద్రబాబు.. మంత్రులంతా తమ తమ జిల్లాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే సోమవారం టీడీపీ నేతలతో అత్యవసర సమావేశమైయ్యారు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడే ధర్నాలు నిర్వహించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూత్రధారేనని తాజా ఆడియో టేపుల్లో బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో చంద్రబాబే ప్రధానపాత్ర పోషించినట్లు స్పష్టంగా తేలిపోయింది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని బాబు స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లోతీవ్ర అలజడి రేపుతోంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








